చీతా ప్రాజెక్టు: లక్ష్యం ఫలించనుందా?.. త్వరలో మరో...

1 Oct, 2022 18:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తన 72వ పుట్టిన రోజు సందర్భంగా నమీబియా నుంచి తీసుకు వచ్చిన ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌ గాల్వియర్‌ కునో నేషన్‌ పార్క్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడూ అందులోని ఒక చీతా ప్రెగ్నెంట్‌ అయి ఉండోచ్చని చీతా కన్జర్వేషన్‌ ఫండ్‌(సీసీఎఫ్‌)కి చెందిన డాక్టర్‌ లారీ మార్కర్‌ అనుమానం వ్యక్తం చేశారు.

ఐతే తాను ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేను గానీ, తాము మాత్రం ఈ చీతాలు వచ్చినప్పటి నుంచి తర్వాత ఏం జరుగుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ఒక వేళ త్వరలో ఒక చిన్న చీతా కూన వచ్చినట్లయితే అది మనకు నమీబియా నుంచి లభించిన మరో అద్భుతమైన గిఫ్ట్‌ అనే చెప్పాలి. ఒక వేళ ఆశా అనే పేరు గల ఈ చీతా గనుక ప్రగ్నెంట్‌ అయితే అదే తొలి చిట్టి చీతా అవుతుందని అన్నారు. అంతేగాదు ఆ చీతాకు(ఆశా) కాస్త స్పేస్‌ ఇచ్చేలా ఎవరూ దాని వైపుకు రాకుండా చూడాలి, పైగా ఒక బోన్‌లో చాలా జాగ్రత్తగా ఉంచాలని చెప్పారు.

(చదవండి: కునా పార్క్‌లోకి చీతాలను వదిలిన ప్రధాని మోదీ, స్వయంగా ఫోటోలు తీస్తూ..)

మరిన్ని వార్తలు