Labour Union Protest: పంజాబ్‌ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్‌!

30 Nov, 2022 17:03 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. వేతనాల పెంపు సహా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో వారితో గొడవకు దిగారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పాయి.  

కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ముందుగా పాటియాలా బైపాస్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి సంగ్రూర్‌లోని సీఎం భగవంత్‌ మాన్‌ ఇంటి వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేయటంతో పలువురికి గాయాలయ్యాయి.

ఇదీ చదవండి: ‘కేజ్రీవాల్‌ సర్‌ మీ మఫ్లర్‌ ఏది?’.. ఢిల్లీ సీఎంకు ఎదురైన వింత ప్రశ్న

మరిన్ని వార్తలు