సరిహద్దుల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం: వి.ఆర్‌. చౌధరి

6 Oct, 2021 07:25 IST|Sakshi

రఫేల్‌తో మరింత బలోపేతం

న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి భారత వాయుసేన సిద్ధంగా ఉందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరి చెప్పారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఇంకా మూడు స్థావారాల్లో  వైమానిక బలగాలను మోహరించి ఉందని, వారిని దీటుగా ఎదుర్కోవడానికి భారత్‌ కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా ఉందని తెలిపారు.

అక్టోబర్‌ 8న  సంస్థ వార్షికోత్సవం ఉండడంతో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా మౌలిక సదుపాయాలను బాగా పెంచుతోందని, అయినప్పటికీ భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి త్రివిధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.  రఫేల్‌ యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్లు, ఇతర అత్యాధునిక ఆయుధాలు వచ్చి చేరడంతో వాయుసేన మరిం త బలోపేతమైందని చౌధరి చెప్పారు.

చదవండి: (కశ్మీరీ పండిట్‌ కాల్చివేత)  

ఇక పాక్‌ డ్రోన్లతో దాడుల్ని ముమ్మరంగా చేస్తోందని దానిని ఎదుర్కోవడానికి యాంటీ డ్రోన్‌ వ్యవస్థల్ని మరింత పెంచుతున్నామని తెలిపారు. రష్యాలో తయారైన ఉపరితలం నుంచి గగనతలానికి లక్ష్యాలను ఛేదించే ఎస్‌–400 క్షిపణులు ఈ ఏడాది వైమానిక దళం అమ్ముల పొదిలోకి చేరతాయని చెప్పారు. హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నుంచి తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్లు ఆరు రానున్నాయని, వచ్చే పదేళ్లలో 35 యుద్ధ స్క్వాడ్రాన్లు కూడా వచ్చి చేరుతాయని చెప్పారు. వాయుసేనని మొత్తంగా ఆధునీకరించి చైనా, పాక్‌ దురాగతాల్ని నివారిస్తామని చౌధరి వివరించారు.  

చదవండి: (13 మంది హజారాలను తాలిబన్లు అన్యాయంగా చంపేశారు)

మరిన్ని వార్తలు