కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. శరీరంపై గాయాలు.. ప్రేమే కారణమా?

22 Oct, 2023 09:03 IST|Sakshi

లక్నో: ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె మృతదేహంపై 500కుపైగా గాయాల గుర్తులు కనిపించడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆమె మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో పోలీస్‌ లైన్‌లోని వసతిగృహంలో నివాసం ఉంటున్న మీను అనే మహిళా కానిస్టేబుల్‌.. గురువారం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. అది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

కాగా, పోస్టుమార్టం నివేదికలో మహిళా కానిస్టేబుల్‌ ఉరివేసుకుని చనిపోయిందని, మృతదేహాంపై 500కుపైగా గాయాల గుర్తులు ఉన్నట్లు వెల్లడైంది. అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో మీను ప్రేమలో ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అతడు మీనును మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని.. బాధితురాలు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మీను.. తననుతాను గాయపరుచుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు