King Cobra: బుసలు కొడుతున్న కింగ్‌ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్న రోషిణి

22 Feb, 2022 12:03 IST|Sakshi

Kerala Lady Forest Officer: సాధారణంగా మనం పామును చూడగానే భయంతో వణికిపోతాం. మనకు దూరంగా పాము వెళ్తున్నా ఆగిపోతాం. అలాంటిది ఓ మహిళ ఎంతో చాకచక్యంగా ఓ పామును పట్టుకొని శభాష్‌ అనిపించుకుంది. ఆమె ధైర్యం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. 

తిరువనంతపురం జిల్లాలోని ఉన్న కట్టక్కడ గ్రామంలోని ఓ ఇంటి వద్ద స్థానికులు పామును గుర్తించారు. దీంతో వారు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో అటవీ శాఖ ఉద్యోగి రోషిణి తన బృందంతో అక్కడికి చేరుకుంది. పామును కింగ్‌ కోబ్రాగా గుర్తించి ఎంతో చాకచక్యంగా ఆమె ఆ పామును పట్టుకున్నారు. అనంతరం పామును సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ సందర్భంగా రోషిణి ధైర్యాన్ని గ్రామస్తులు ప్రశంసించారు. 

ఇదిలా ఉండగా రోషిణి పామును పట్టిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామేన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రోషిణి తిరువనంతపురంలోకి పారుతిపల్లి రేంజ్‌ ఆఫీసులో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లో ఉద్యోగం చేస్తోందన్నారు. ఆమె పాములను పట్టడంతో శిక్షణ పొందారని వెల్లడించారు. ఈ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి ఫిదా అయిపోయి.. ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు