డాగ్‌ వాకర్‌కు లక్షల్లో జీతం!

26 Oct, 2020 17:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లోని ‘జోసఫ్‌ హేజ్‌ ఆరోన్‌సన్‌’ న్యాయవాద సంస్థ ఓ చిత్రమైన ఉద్యోగానికి ఆకర్షణీయమైన ప్రకటన చేసింది. తమ సంస్థలోని ఓ సీనియర్‌ సభ్యుడికి ఓ పెంపుడు కుక్క ఉందని, ఆ కుక్కను ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లపై తిప్పిందేకు ఓ డాగ్‌ వాకర్‌ కావాలని ప్రకటన సారాంశం. ఈ ఉద్యోగానికి కుక్కలను ప్రేమించేవారు, అంటే వాటిని ప్రేమగా చూసుకునే వారే ఈ ఉద్యోగానికి అర్హులంటూ పేర్కొంది. ఆ ఉద్యోగానికి అక్షరాల ఏడాదికి 30 వేల పౌండ్లను (దాదాపు 29 లక్షల రూపాయలు, నెలకు రెండు లక్షలపైనే) జీతంగా ఇస్తారని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

జీతం కాకుండా పింఛను, జీవిత బీమాలతోపాటు ప్రైవేటు ఆరోగ్య , డెంటల్‌ బీమా సదుపాయాలు కూడా ఉంటాయని పేర్కొంది. ఉద్యోగపు వేళలు ప్రతి సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలవరకు పెంపుడు కుక్క యోగ క్షేమాలు చూసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ముఖ్యంగా డాగ్‌ వాకర్‌ కూర్చున్న చోట, కూర్చోకుండా కుక్క వెంట లండన్‌ వీధులన్నీ తిరుగుతూనే ఉండాలని, ఇందుకు ఉద్యోగికి ఫిట్‌నెస్‌ కూడా అవసరమని పేర్కొంది. ప్రతి శనివారం, ఆదివారం వీకెండ్‌ ఆఫ్‌లు తీసుకోవచ్చుగానీ, రోజు వారి పని వేళల్లో మాత్రం పట్టు విడుపులు ఉండాల్సిందేనని కూడా ఆ ‘వాంటెడ్‌’ ప్రకటన విన్నవించింది. ఈ డాగ్‌ వాకర్‌ ఉద్యోగానికి ఆడ, మగ ఎవరైనా అర్హులేనని, అయితే అనుభవం ఉండడం ముఖ్యమని కూడా పేర్కొంది. ఇంటర్వ్యూలు ఆ న్యాయవాద సంస్థ ప్రకటించలేదుగానీ దరఖాస్తులు మాత్రమే తెగ వచ్చి పడుతున్నాయట. చదవండి: దివ్య కేసు: నాగేంద్ర అరెస్ట్‌కు రంగం సిద్ధం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు