Lakhimpur Case: కేసు విచారణకు ఐదేళ్లు పడుతుంది

12 Jan, 2023 13:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అమాయకులైన రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్న లఖింపూర్‌ ఖేరి హింసా కాండ కేసు విచారణ పూర్తి కావడానికి దాదాపు అయిదేళ్లు పడుతుందని సుప్రీంకోర్టుకు సెషన్స్‌ కోర్టు విన్నవించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా నిందితుడిగా ఉన్న ఈ కేసులో 208 మంది సాక్షులు, 171 డాక్యుమెంట్లు, 27 ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరెటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నివేదికలు ఉన్నాయని సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి తెలిపారు.

ఆశిశ్‌ మిగ్రా బెయిల్‌ విచారణ సందర్భంగా గత నెలలో ఈ కేసు విచారణ పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుందని సుప్రీం అడిగిన ప్రశ్నకు సెషన్స్‌ కోర్టు ఈ విధంగా బదులిచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ సూర్యకాంత్‌, వి రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఒక నివేదికను సుప్రీంకు సమర్పించింది. తదుపరి విచారణను జనవరి 19కి ధర్మాసనం వాయిదా వేసింది. కాగా అక్టోబర్ 3, 2021న నూతన వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా లఖింపూర్ ఖేరీ జిల్లాలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు చెలరేగిన హింసాకాండలో ఎనిమిది మంది మరణించిని విషయం తెలిసిందే. 
చదవండి: ఆప్‌కు భారీ షాక్‌.. పదిరోజుల్లో 160 కోట్లు చెల్లించాల్సిందే, లేకుంటే ఆఫీస్‌కు సీజ్‌!

మరిన్ని వార్తలు