లాలు యాదవ్‌ కుమార్తె ట్వీట్‌... బలపడనున్న 'గత బంధం'

9 Aug, 2022 15:21 IST|Sakshi

పాట్నా: బిహార్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నిష్క్రమణతో బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మేరకు జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం తోపాటు మళ్లీ నితీష్‌ కుమార్‌ లాలు యాదవ్‌ భాగస్వామ్యం రానునుంది. అంతేకాదు నితీష్‌ కుమార్‌ మంగళవారం సాయంత్ర 4 గం.లకు గవర్నర్‌ ఫాగు చౌహాన్‌తో సమావేశం అవ్వాలని కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు నితీష్‌కి మద్దతుగా దాదాపు 160 మంది ఎమ్మెల్యేలు అధికార సంకీర్ణానికి విధేయత చూపుతామని ప్రమాణం చేశారు.

పైగా మంగళవారం ఉదయమే నితీష్‌ తన అధికారికి నివాసంలో జేడీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు కూడా. దీంతో నితీష్‌ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లాలు యాదవ్‌ కుమార్తె రోహిణి యాదవ్‌ ఆ మాటలకు బలం చేకూరుస్తూ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. ఈ మేరుకు ఆమె ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ... వెలుగులోకి రావలనుకున్నావారు త్వరపడండి, ఏకగ్రీవంగా సీఎంని ఎన్నుకునేందుకు సిద్దంగా ఉండండి అని ట్వీట్‌ చేశారు. పైగా నితీష్‌ లాలుల గత బంధ బలపడునుందని, ఈ మహా గతబంధన్‌ ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

వాస్తవానికి నితీష్‌ కుమార్‌ 2017లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు మహాకూటమి నుంచి వైదొలిగారు. బిహార్‌లో దాదాపు 243 మంది సభ్యుల అసెంబ్లీ ఉంది. ఐతే మొత్తం ఎమ్మెల్యేల్లో బిజేపీకి 77, జేడీయేకి 45 మంది సభ్యులు ఉండగా, ఆర్జేడీ సుమారు 127 మంది సభ్యులతో అతి పెద్ద పార్టీగా అవతరించింది.

అదీగాక జేడీయూలో సీనియర్‌ నాయకుడు ఆర్‌సీపీ సింగ్‌ వైదొలగడం, అతనికి మాత్రమే మంత్రి పదవి ఇ‍వ్వడం తదితర కారణాలే బిహార్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడటానికి కారణం. తాను  సీఎం అయినప్పటికీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తకి లోనైన సీఎం నితీష్‌ కుమార్‌ తప్పుకునేందుకు రెడీ అయ్యారు. 

(చదవండి:  సీఎం పదవికి నితీష్‌ కుమార్‌ రాజీనామా?

మరిన్ని వార్తలు