దేశ స్వాతంత్ర వేడుకల వేళ... బయటపడ్డ 38 ఏళ్ల నాటి సైనికుడు మృతదేహం

14 Aug, 2022 18:06 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాం. అజాది కా అమృత మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటూ.... నాటి త్యాగధనులను స్మరించుకుని ఆనంద పడుతున్న వేళ లాన్స్‌ నాయక్‌ చంద్రశేఖర్‌ అనే వీర సైనికుడి మృతదేహం హిమనీనాదం నుంచి బయటపడింది.

ఉత్తరప్రదేశ్‌లోని హల్ద్వానీలో ఒక కుటుంబం నిరీక్షణకు ఫలితం దక్కి నాటి మేఘదూత ఆపరేషన్‌ పాల్గొన్న వీర సైనికుడి మృతదేహం లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ 1984 సియోచిన గ్లేసియర్‌ని ఆక్రమించి పాకిస్తాన్‌ స్థానాలపై పట్టు సాధించేందుకు మేఘదూత ఆపరేషన్‌ని చేపట్టింది. అందులో భాగంగా భారత సైన్యం మే 29, 1984న19వ కుమావోన్ రెజిమెంట్ నుంచి ఒక బృందం ఈ ఆపరేషన్‌ కోసం బయలుదేరింది. అందులో లాన్స్‌ నాయక్‌ చంద్రశేఖర్‌ కూడా ఉన్నాడు. ఐతే ఆ బృందం ఆ రోజు రాత్రి హిమనీనాదంలో చిక్కుకుపోయింది.

దీంతో ఒక అధికారి సెకండ్ లెఫ్టినెంట్ పిఎస్ పుండిర్‌తో సహా 18 మంది భారతీయ ఆర్మీ సైనికులు మరణించారు అని ఒక అధికారి తెలిపారు. మొత్తం 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఐదుగురు గల్లంతయ్యారు. ఐతే భారత ఆర్మీ గస్తీకి వేసవినెలలో మంచు కరుగుతున్నప్పుడూ తప్పిపోయిన సైనికులను గుర్తించే బాధ్యతను అప్పగిస్తారు. అందులో భాగంగా గస్తీ వెతికే చర్యలు చేపట్టినప్పుడూ ఆగస్టు 13న సియాచిన్‌లో 16 వేల అడుగుల ఎత్తులో ఒక సైనికుడి అస్థిపంజర అవశేషాలు కనుగొన్నారు.

ఆ అవశేషలపై ఉన్న ఆర్మీ నంబర్‌తో కూడిన డిస్క్ సాయంతో ఆ అవశేషం లాన్స్‌ నాయక్‌ చంద్రశేఖర్‌దిగా గుర్తించారు. చంద్రశేఖర్‌కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు అతని హయాంలో ఉన్న ఆర్మీ సిబ్బందితో సహా ఇతర అధికారులు, బంధువులు స్నేహితులు హల్ద్వానీకి తరలివచ్చి ఆ వీరుడికి కన్నీటి వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

1984లో భారత ఆర్మీ చేపట్టిన ఈ మేఘదూత ఆపరేషన్‌ పాకిస్తాన్‌పై చేప‍ట్టిన అత్యంత వ్యూహాత్మకమైన ఆపరేషన్‌గా మిగిలింది. భారతదేశ నియంత్రణలో ఉన్న అత్యంత కీలకమైన సియాచిన్ గ్లేసియర్ తూర్పు కారాకోరం శ్రేణిలో పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్‌ తోపాటు చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతాలైన షక్స్‌గామ్ వ్యాలీకి సరిహద్దుగా ఉంటుంది.

(చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం)

మరిన్ని వార్తలు