భూమి అలా ఉబికొచ్చిందేంటి?.. జనాలు షాక్‌..

24 Jul, 2021 08:52 IST|Sakshi
వీడియో దృశ్యాలు

చండీగఢ్‌ : హార్యానాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వాగులోని నీటిలోంచి భూమి ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చింది. ఏదో మంత్రం వేసినట్లుగా భూమి ఓ మీటరు పైకి వచ్చింది. భూమి అలా నీటిలోంచి బయటకు ఉబికి రావటం చూసి అక్కడి జనాలు షాక్‌ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది.

వీడియో దృశ్యాలు

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ భూమిలోపల ఉండే టెక్టోనిక్‌ ప్లేట్‌ కదలికల వల్లే అలా జరిగింది’’... ‘‘టెక్టోనిక్‌ వల్ల కాదు! భూమిలోపల ఉన్న మిథేన్‌ తడి పొరల్లోంచి బుడగలాగా పైకి వచ్చింది. అక్కడ జరిగింది అదే!’’.. ‘‘అరే వీడియో తీస్తున్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ ప్రాణాలు పోతాయి’’... ‘‘నిజంగా ఏదో సినిమాలో చూసినట్లుగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన ఎప్పుడు, సరిగ్గా ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు