దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు 

14 Jun, 2021 09:56 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. 75 రోజుల తర్వాత కరోనా కేసులు 70 వేలకు దిగొచ్చాయి. తాజాగా గత 24 గంటల్లో భారత్‌లో 70,421 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 3,921 మంది కోవిడ్‌తో మృతి చెందారు. దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,74,305కి చేరింది. ఇక 1,19,501 మంది క‌రోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు.

ఇప్పటివరకు దేశంలో 2,81,62,947 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 9,73,158 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 14,92,152 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశంలో మొత్తం పరీక్షల సంఖ్య 37,96,24,626కు చేరింది.  ఇక ఇప్పటి వరకు  25.48 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

చదవండి: నెగిటివ్‌ రిపోర్టు వద్దనేసరికి రోడ్లన్నీ జామ్‌!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు