Morning 10 AM Top News: మార్నింగ్‌ టాప్‌ 10 తెలుగు న్యూస్‌

7 Jul, 2022 09:41 IST|Sakshi

1. CM YS Jagan: మార్గ నిర్దేశకుడు
తప్పుడు కేసులకు భయపడలేదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడినా వెరవలేదు. ప్రజలకు మేలు చేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పదేళ్లు అలుపెరగని పోరాటాలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలా భరోసా కల్పించారు.
► పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

2. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌కు మరో షాక్‌.. సర్కార్‌ పడిపోనుందా..?
బ్రిటన్‌లో రాజకీయ అనిశ్చితి తీవ్రతరమైంది. మంగళవారం భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌లతో మొదలైన రాజీనామాల పర్వం బుధవారం మరింత ఊపందుకుంది. 
► పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Rajya Sabha Nominated MPs 2022: రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు
దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకొని, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్న భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా మరో అస్త్రం సంధించింది. నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు పంపిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
► పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

4. Eknath Shinde: పిక్చర్‌ అభీ బాకీ హై!
‘కాస్తంత ఊపిరి తీసుకోనివ్వండి. కొద్దిరోజులుగా బోలెడంత హడావిడిలో ఉన్నా!’ మహారాష్ట్ర శాసనసభలో సోమవారం నాటి విశ్వాస పరీక్షలో నెగ్గిన వెంటనే విలేఖరులతో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే అన్న మాటలివి. 
► పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. హైదరాబాద్‌కు ‘ఎగిరొచ్చిన’ ప్రపంచంలోనే నంబర్‌ 1 సంస్థ
రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ రూ.1200 కోట్లతో తన కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
► పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. Krishna Vamsi: కృష్ణ వంశీ భారీ ప్లాన్‌.. రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్‌!
కరోనా తర్వాత జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. దీంతో స్టార్‌ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ కోసం వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్‌ కంటెంట్‌ కోసం బాగానే ఖర్చు చేస్తున్నాయి. తెలుగులో కూడా పదుల సంఖ్యల్లో వెబ్‌ సిరీస్‌లు వస్తున్నాయి.
► పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. IND vs ENG T20: టి20 సమరానికి సై.. పూర్తి స్థాయి టి20 స్పెషలిస్ట్‌ల టీమ్‌తో ఇంగ్లండ్‌
ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో టి20 ప్రపంచకప్‌ జరగనుంది. ఆ లోగా భారత్‌ వేర్వేరు టోర్నీల్లో కలిపి 15 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి ప్రపంచకప్‌ జట్టు కూర్పు విషయంలో ఒక అంచనాకు వచ్చేందుకు ఇంగ్లండ్‌తో సిరీస్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది.
► పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. వంటనూనెల ధరల్ని తగ్గించండి, తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు!
అంతర్జాతీయంగా రేట్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దిగుమతి చేసుకున్న వంటనూనెల ధరలను వారం రోజుల్లోగా లీటరుకు రూ. 10 వరకూ తగ్గించాలని తయారీ సంస్థలను కేంద్రం ఆదేశించింది. అలాగే, ఒక బ్రాండ్‌ ఆయిల్‌పై దేశవ్యాప్తంగా ఒకే ఎంఆర్‌పీ (గరిష్ట చిల్లర ధర) ఉండాలని సూచించింది.
► పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. గృహిణులు టార్గెట్‌గా కొత్త రకం ఆన్‌లైన్‌ మోసాలు
పిల్లలు స్కూల్‌కి, భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి పనుల్లో తీరికలేకుండా ఉన్న ఉమాదేవికి గేటు దగ్గర నుంచి ‘కొరియర్‌..’ అన్న కేక వినిపించింది. బయటకు వచ్చి అడిగితే ‘ఉమాదేవి పేరున పార్సిల్‌ వచ్చింది’ అని చెప్పాడు బాయ్‌.
► పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ
ఇటీవల జరిగిన ‘అగ్నిపథ్‌’ ఆందోళనలు, రైళ్ల దహనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లలో అధునాతన సీసీటీవీ భద్రతా వ్యవస్థను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటివరకు ఉన్న సాధారణ సీసీ కెమెరాల స్థానంలో హైటెక్‌ కెమెరాలతో కూడిన వీడియో నిఘా వ్యవస్థ–వీఎస్‌ఎస్‌ (సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌)ను ఏర్పాటు చేయనుంది.
► పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు