Morning 10 AM Top News: మార్నింగ్‌ టాప్‌ 10 తెలుగు న్యూస్‌

8 Jul, 2022 09:56 IST|Sakshi

1. YS Rajasekhara Reddy Jayanthi: మహా మనిషి
పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత కొలువులకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని నిరుపేదల చెంతకు తెచ్చి ప్రజారోగ్యానికి భరోసానిచ్చారు. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

2. Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలకలం రేపాయి. జపాన్‌ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో ఓ సభలో మాట్లాడుతుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాయి. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

3. YSR Jayanthi 2022: వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్‌, కుటుంబ సభ్యులు
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

4. సేవకుల తయారీ విధానమది
బ్రిటిష్‌ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

5. కాంగ్రెస్‌లో చేరికలు.. అలకలు
‘ఒక్క చేరిక.. రెండు అసంతృప్తులు’ అన్నట్లుగా కాంగ్రెస్‌ పరిస్థితి ఉందనే చర్చ కార్యకర్తల్లో సాగుతోంది. కొత్త చేరికలు పాతవారి అలకలకు కారణమవుతున్నాయి. చేరికలతో కాంగ్రెస్‌ పార్టీ బలపడుతోందని భావిస్తున్న తరుణంలో కొంతమంది పాతనేతల అసంతృప్తి క్యాడర్‌ను నిరుత్సాహానికి గురిచేస్తోంది.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

6. YSRCP Plenary 2022: దారులన్నీ ప్లీనరీ వైపే
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

7. The Warrior-Ram Pothineni: ఇది అందరికీ సూట్‌ అయ్యే టైటిల్‌
‘‘నేను ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాన్ని హైదరాబాద్‌లో షూట్‌ చేస్తున్నప్పుడు లింగుసామి ‘ది వారియర్‌’ సినిమా తీస్తున్నారు. అయితే ఆయన తర్వగా షూటింగ్‌ పూర్తి చేసేశారు. సినిమాను విడుదల కూడా చేసేస్తున్నారు. మేం మెల్లిగా చేస్తూ వస్తున్నాం. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Rohit Sharma: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్‌ శర్మ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో!
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో వరుసగా 13 విజయాలు అందుకున్న తొలి సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన మొదటి టీ20లో విజయంతో ఈ ఘనతను రోహిత్‌ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. విమాన ప్రయాణికులకు బంపరాఫర్‌!
విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఏసియా బంపరాఫర్‌ ప్రకటించింది. 'స్ప్లాష్ సేల్'ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో ప్రయాణికులు ఢిల్లీ - జైపూర్ వంటి మార్గాల్లో తక్కువ ధరకే ఫ్లైట్‌ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. సక్సెస్‌ స్టోరీ: జేమ్స్‌బ్రాండ్‌
ప్రపంచంలోని టాప్‌ ఫ్యాషన్‌ స్కూళ్ళ ముఖం ఎప్పుడూ చూడలేదు కరణ్‌ తొరాని. అయితేనేం...‘మోస్ట్‌ ప్రామిసింగ్‌ ఇండియన్‌ డిజైనర్‌’గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. తానే ఒక బ్రాండ్‌గా మారాడు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు