Evening Top Trending News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

27 Jul, 2022 16:56 IST|Sakshi

1.. వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ రెండోరోజు పర్యటన.. అప్‌డేట్స్‌
తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను సీఎం జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. ఇంత పారదర్శకతతో గతంలో ఎప్పుడూ జరగలేదు. ముంపు బాధితులకు అండగా ఉంటామన్నారు. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2.. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై స్పందించిన రేవంత్‌
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పందించారు. రాజగోపాల్‌ రెడ్డి అంశం పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు. రాజగోపాల్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో శివసేనకు చెందిన వ్యక్తే మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ప్రజలకు హామీ ఇచ్చారు. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రయోగాన్ని ఆయన వెనకేసుకొచ్చారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. తీవ్ర వికారంతో బాధపడుతున్న పుతిన్‌!... అత్యవసర చికిత్స అందిస్తున్న​ వైద్య బృందాలు
రష్యా నాయకుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని రష్యా టెలిగ్రామ్‌ ఛానెల్‌ పేర్కొంది. దీంతో హుటాహుటిని రెండు వైద్య బృందాలు ఆయన నివాసానికి తరలివచ్చినట్లు పేర్కొంది.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5.. హైదరాబాద్‌: మూసీ నదికి పోటెత్తిన​ వరద.. రాకపోకలు బంద్‌
భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌, హియాయత్‌సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక్కో రిజర్వాయర్‌కు 8 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. మూసీ నది ఉధృతితో అధికారులు అలర్ఠ్‌ అయ్యారు. అంబర్‌పేట-కాచిగూడ, మూసారాంబాగ్‌- మలక్‌పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. Tollywood: అగ్ర హీరోలతో దిల్‌ రాజు కీలక భేటీ, దిగొచ్చిన బన్నీ, తారక్‌, చరణ్‌
టాలీవుడ్‌ నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ సంక్షోభంలో భాగంగా పలువురు అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో బడ్జెట్‌ సంక్షోభం నెలకొంది.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7..  విండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌! సిరీస్‌ మొత్తానికి అతడు దూరం?
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టాపార్డర్‌ బ్యాటర్‌, పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ సిరీస్‌ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అతడు కోవిడ్‌ బారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకున్నట్లు సమాచారం.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8.  వందల కోట్లే, దేశంలో అత్యధిక వేతనం పొందే ఐటీ కంపెనీ సీఈవో ఎవరో తెలుసా!
కోవిడ్‌ కారణంగా అన్నీ రంగాలు కుదేలయ్యాయి. కానీ ఐటీ రంగం మాత్రం అందుకు భిన్నంగా ఎన్నడూ లేని విధంగా కార్యకలాపాల్ని నిర్వహించాయి. భారీ లాభాల్ని గడించాయి. అయితే ఇప్పటి వరకు మన దేశానికి చెందిన ఏ  ఐటీ కంపెనీ సీఈవో అత్యధిక వేతనం పొందుతున్నారో తెలుసా? ఇంతకీ ఆయన పేరేంటీ? ఆ సంస్థ ఏంటో తెలుసుకోవాలని ఉందా?
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9.యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌తో లాభాలెన్నో! మచ్చలు, చుండ్రు మాయం!
యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ బరువుని నియంత్రణలో ఉంచడంతోపాటు చర్మం, జుట్టుని కూడా చక్కగా సంరక్షిస్తుంది. యాపిల్‌ సైడర్‌వెనిగర్‌ను ముఖానికి రాసుకుంటే ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10..అమ్నీషియా పబ్‌ కేసు.. ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్‌ మంజూరు
అమ్నీషియా పబ్‌ రేప్‌ కేసులో ఎమ్మెల్యే కొడుకుకి బెయిల్‌ లభించింది. ఎమ్మెల్యే కొడుకు రహిల్‌ ఖాన్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మొదట జువెనైల్ బోర్డు బెయిల్‌కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్‌ కోసం అప్పీల్ చేసుకున్నాడు.
పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు