అది చరిత్రలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

26 May, 2023 10:11 IST|Sakshi

అది చరిత్రలో అత్యంత వైభవంగా, లెక్కకు అందనంత ఖర్చుతో జరిగిన వివాహం. స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ మిట్టల్‌ తన కుమార్తె వినిషా మిట్టల్‌ పెళ్లికి డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టారు.ఈ ఘనమైన వివాహానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ మిట్టల్‌ కుమార్తె వినిషా మిట్టల్‌ వివాహం 2004లో అత్యంత వైభవంగా జరిగింది. ప్యారిస్‌లో జరిగిన ఈ వివాహం కోసం లక్ష్మీ మిట్టల్‌ ఏకంగా రూ. 240 కోట్లు ఖర్చుచేశారు. ఇది దేశంలోనే అత్యంత వైభవంగా జరిగిన వివాహంగా గుర్తింపు పొందింది.

వినిషాకు ప్యారిస్‌లోని వాక్స్‌ లె వియోకొమ్టె మహల్‌లో వివాహం జరిగింది.6 రోజుల పాటు జరిగిన ఈ ఇండియన్‌ వెడ్డింగ్‌కు ప్యారిస్‌ ప్రభుత్వం కూడా సహకారం అందించడం విశేషం.వినిషాకు అమిత్‌ భాటియాతో వివాహం జరిగింది. వినిషా పెళ్లిలో ఫేమస్‌ డిజైనర్లు, మెహందీ ఆర్టిస్టులు, ప్రముఖ కుక్‌లు భాగస్వాములయ్యారు. ఇంతేకాదు ఈ వివాహాన్ని మరింత వినోదమయం చేసేందుకు బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ వివాహానికి 10 వేలమంది అతిథులు హాజరయ్యారు. వినిషా మిట్టల్‌ వివాహానికి కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌ టీమ్‌ను డాన్స్‌ నేర్పేందుకు పిలిపించారు.

ఇంతేకాదు రైటర్‌, సింగర్‌ జావేద్‌ అక్తర్‌ ఖాన్‌.. మిట్టల్‌ ఫ్యామిలీ కోసం ఒక డ్రామా రూపొందించారు. దీనిలో మిట్టల్‌ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. అమెరికన్‌ సింగర్‌ కైలీ మినాగ్‌ ఈ వేడుకలో ఒక గంటపాటు ప్రదర్శన ఇచ్చారు. ఇందుకోసం ఆమె కోటి రూపాయల పారితోషికం తీసుకున్నారు. లక్ష్మీ మిట్టల్‌ కుమార్తె పెళ్లికి బాలీవుడ్‌ ప్రముఖులు జుహీచావ్లా, రాణీ ముఖర్జీ,ఐశ్వర్యరాయ్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌ తదితరులు హాజరయ్యారు.

వీరంతా స్టేజీపై నృత్యాలు చేశారు.ఈ పెళ్లికి హాజరైన అతిథులకు రాయల్‌ వెజిటేరియన్‌ ఫుడ్‌ సర్వ్‌ చేశారు. ఇందుకోసం కోల్‌కతాకు చెందిన ప్రముఖ ఇండియన్‌ షెఫ్‌ మున్నా మహరాజ్‌ను ప్యారిస్‌ రప్పించారు. ఇంతఘనంగా జరిగిన ఈ వివాహాన్ని ఎవరూ మరచిపోలేరు. అయితే లక్ష్మీ మిట్టల్‌ కుమార్తె వినిషా వివాహం కేవలం 10 ఏళ్లపాటు మాత్రమే కొనసాగింది. 2014లో విషిషా, అమిత్‌ భాటియా విడాకులు తీసుకున్నారు. లక్ష్మీ మిట్టల్‌ ప్రపంచంలోనే టాప్‌ బిజినెస్‌ మ్యాన్‌లలో ఒకరిగా నిలిచారు.2005లో ఫోర్బ్స్‌ లిస్టులో ‍మిట్టల్‌ ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనికునిగా చోటు దక్కించుకున్నారు. 

మరిన్ని వార్తలు