గవర్నర్‌ వైఖరిపై ఎల్‌డీఎఫ్‌ విస్తృతస్థాయి నిరసన

9 Nov, 2022 07:08 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలో అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వాన్ని బహిరంగంగా తీవ్రంగా తప్పుబట్టే ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌పై క్షేత్రస్థాయి విస్తృత నిరసన కార్యక్రమాలకు ఎల్‌డీఎఫ్‌ శ్రేణులు తెరతీశాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గవర్నర్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా కరపత్రాలు పంచిపెట్టాయి. భారత రాజ్యాంగంపై కనీస అవగాహనలేని గవర్నర్‌ పూర్తిగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ తరఫున పనిచేస్తున్నారని ఆ కరపత్రాల్లో ప్రచురించారు. ఉన్నత విద్య పరిరక్షణకు ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎడ్యుకేషన్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ పేరిట ఈ కరపత్రాలు ముద్రితమయ్యాయి.

ఈనెల 15వ తేదీన రాజ్‌భవన్‌ ఎదుట ఏకంగా లక్షమందితో భారీ నిరసన కార్యక్రమానికి ఏర్పాటుచేస్తున్నట్లు ఎల్‌డీఎఫ్‌ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తున్నారని, గుత్తాధిపత్యం రాజ్యమేలుతోందని గవర్నర్‌ ఖాన్‌ సోమవారం విమర్శించిన విషయం తెల్సిందే.

ఇదీ చదవండి: గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి?

మరిన్ని వార్తలు