లేడీస్‌ హాస్టల్‌లో చిరుతపులి

1 Dec, 2020 17:56 IST|Sakshi

గువాహటి: ఓ లేడీస్‌ హాస్టల్‌లో ప్రవేశించిన చిరుతపులి భయాందోళనలను సృష్టించింది. గువహటిలోని హెంగ్రాబరీ ప్రాంతంలో లేడిస్‌ హాస్టల్‌లోకి చిరుతపులి ప్రవేశించడంతో స్థానికంగా అలజడి రేగింది.  హాస్టల్‌ వార్డెన్‌ ఫిర్యాదు మేరకు అస్సోం రాష్ట్రంలోని జూ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను బంధించారు. హస్టల్‌ వార్డెన్‌ మౌసుమి బోర సమాచారం మేరకు సోఫా కింద ఏదో క్లాత్‌ ఉందని తీయడానికి ప్రయత్నించగా అది క్లాత్‌ కాదని కూృరమృగమని తెలిసింది. వెంటనే బోరాతో సహా హాస్టల్‌లో ఉంటున్న మరో 15మంది పైకి వెళ్లిపోయి రూమ్‌ డోర్‌ వేసుకోని ఫారెస్ట్‌ అధికారులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు.  చదవండి: (రాజీవ్‌ గాంధీ విగ్రహానికి మసి పూశారు)

ట్రాంక్విలైజర్‌ గన్‌తో అస్సోం జూ అధికారులు, వైల్డ్‌ లైఫ్‌  టెర్రిటోరియల్‌ డివిజన్‌ అధికారులు పోలీసులతో కలిసి హాస్టల్‌కు చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటలసేపు కష్టపడి చిరుత పులిని బంధించి జూ కి తరలించారు. చిరుతపులికి గాయాలు అయ్యాయేమో చూసి అడవిలో వదిలుతామన్నారు. దీనిలో భాగంగా చిరుతకు మైక్రోచిప్‌ని అమర్చుతామని అధికారులు తెలిపారు. అధికారుల మరోక విజయవంతమైన ఆపరేషన్‌ చేశారని, హాస్టల్‌లో ప్రవేశించిన ఒక చిరుతపులిని ఎలాంటి హానీ జరగకుండా రెస్క్యూ చేశారని అస్సోం అటవీ శాఖ మంత్రి పరిమల్‌ శుక్లాబైద్య ట్వీట్‌ చేశారు. ఈ విజయం అస్సోం జూ అధికారులదని ఆయన కొనియాడారు. (చదవండి: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే నిర్వాకం)

>
మరిన్ని వార్తలు