పిడుగులు పడి ఒకే రోజు 14 మంది మృతి.. 16 మందికి గాయాలు

21 Jul, 2022 09:19 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల‍్లో బుధవారం పిడుగుల వర్షం కురిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సహాయ కమిషనర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బండా జిల్లాలో పడిన పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ఫతేపూర్‌లో ఇద్దరు, బలరామ్‌పుర్‌, చందౌలీ, బలుందర్‌శహర్‌, రాయ్‌బరేలీ, అమేఠీ, కౌశాంబీ, సుల్తాన్‌పుర్‌, చిత్రకూట్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పిడుగుల ఘటనలపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించాలని సూచించినట్లు చెప్పారు కమిషనర్‌. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.

ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు

మరిన్ని వార్తలు