పార్టీల నగదు విరాళాలు రూ.2,000 మించొద్దు.. కేంద్రానికి ఈసీ లేఖ

20 Sep, 2022 05:05 IST|Sakshi

కేంద్రానికి ఈసీ ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కీలక ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తెరపైకి తెచ్చింది. ‘‘పార్టీలకు అందే విరాళాల విషయంలో మరింత పారదర్శకత అవసరం. ప్రస్తుతం రూ.20 వేలున్న అనామక నగదు విరాళాల పరిమితిని రూ.2 వేలకు తగ్గించాలి.

మొత్తం విరాళాల్లో అవి 20 శాతానికి/రూ.20 కోట్లకు (ఏది తక్కువైతే దానికి) మించరాదు’’ అని పేర్కొంది. ఇలాంటి పలు సంస్కరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్‌ రిజిజుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ లేఖ రాసినట్టు సమాచారం. వీటికి కేంద్రం ఆమోదం లభిస్తే రూ.2,000కు మించి ప్రతి నగదు విరాళానికీ పార్టీలు లెక్కలు చూపించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు