ఉదయ్‌పూర్‌ టైలర్‌ హత్యకేసులో హైదరాబాద్‌కు లింకులు?

6 Jul, 2022 12:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉదయ్‌పూర్‌‌ టైలర్ కన్హయ్య హత్య కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్య కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైదరాబాద్‌లో షెల్టర్‌‌ తీసుకున్నారనే సమాచారంతో ఎన్‌ఐఏ మంగళవారం సోదాలు చేసింది.

సంతోష్‌నగర్‌‌లో తావీద్ సెంటర్ నిర్వహిస్తున్న.. బిహార్‌కు చెందిన మహ్మద్‌ మున్వార్ హుస్సేన్‌ అశ్రఫి అనే వ్యక్తి అదుపులోకి తీసుకొని ఎన్‌ఐఏ విచారించింది. ఈ నెల 14న  జైపూర్‌‌లోని ఎన్‌ఐఏ ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది.

చదవండి: (ఉదయ్‌పూర్‌ హత్య కేసు.. మరో కీలక విషయం వెలుగులోకి..)

>
మరిన్ని వార్తలు