మనీష్‌ సిసోడియాకు మరోసారి చుక్కెదురు..బెయిల్‌ విచారణ వాయిదా..

21 Mar, 2023 16:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీష్‌ సిసోడియాకు మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మార్చి 25కి వాయిదా పడింది. ఈ మేరకు సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు జారీ చేసింది రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు. 

అలాగే సీబీఐ పిలుపు మేరకు దర్యాప్తుకి వచ్చానని, పైగా తాను ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సమాజంలో అత్యున్నత హోదాలో ఉన్నానని పిటిషన్‌లో తెలిపారు. అంతేగాదు ఈ కేసులో అరెస్టయిన వారందరికీ బెయిల్‌ మంజూరు అయిన విషయాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, వాస్తవానికి మార్చి 20వ తేదితో సిసోడియా జ్యూడీషియల్‌ కస్టడీ ముగియనుండగా..ఈడీ తన రిమాండ్‌ను పొడిగించాలంటూ మరోసారి పిటీషన్‌ దాఖలు చేసింది.

అంతేగాదు వాదనల సందర్భంగా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది ఈడీ. ఆయన లిక్కర్‌స్కాం సమయంలో ఫోన్‌ని నాశనం చేశారు కాబట్టి మరోసారి విచారించాలని ఈడీ పట్టుబట్టింది. దీంతో ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. కాగా, మార్చి9న మనీ లాండరింగ్‌ కేసులో సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ ఆయన్ను సుమారు 11 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. 

(చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..)
మరిన్ని వార్తలు