Vegetables List Viral Photo: భర్తకు కూరగాయల ఎంపిక పరీక్ష.. పాసవుతాడా?

25 Sep, 2023 11:33 IST|Sakshi

ప్రతీ ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవలనేవి సాధారణంగా వస్తూనే ఉంటాయి. దంపతుల మధ్య గొడవలనేవి లేకపోతే మాధుర్యమే ఉండదని అనేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా దంపతుల మధ్య ఇంటిలోని వస్తువులను కొనుగోలు చేసే విషయంలో గొడవలు వస్తుంటాయి. భార్యాభర్తలు మార్కెట్‌కు వెళ్లి, వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు వారి మధ్య వాదనలు చోటుచేసుకుంటాయి. అలాగే భార్య.. భర్తకు లిస్టు ఇచ్చి, ఏమైనా సరుకులు తీసుకురమ్మని చెప్పినప్పుడు, భర్త ఏదైనా మరచిపోతే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. 

తాజాగా ఇలాంటి ఒక ఉదంతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక భార్య.. మార్కెట్‌కు వెళ్లి, తీసుకురావాల్సిన కూరగాయల లిస్టును భర్తకు ఇచ్చింది. దానిలో తీసుకురావాల్సిన కూరగాయల గురించి రాసింది. అవి ఏ రీతిలో ఉండాలో క్షుణ్ణంగా రాసింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ లిస్టును చూసినవారికి తల తిరిగిపోతోంది. 

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ కూరగాయల లిస్టులో ముందుగా టమాటాలు ఎలా ఉండాలో తెలిపింది. టొమాటాలు పసుపు, ఎరుపు రంగులోనే ఉండాలని, వాటికి పగుళ్లు ఉండకూడదని రాసింది. తరువాత ఉల్లిపాయల విషయానికొస్తే.. ఈ జాబితాను రూపొందించిన భార్య ఉల్లిపాయ బొమ్మ గీసి, ఎలాంటి ఉల్లిపాయలను ఎంచి తీసుకురావాలో వివరించింది. అదేవిధంగా బంగాళాదుంపల ఎంపిక వివరాలు కూడా ఉన్నాయి. అలాగే మిరపకాయలు, పాలకూర, లేడీ ఫింగర్‌..  ఇలా వీటి కొనుగోలుకు సంబంధించిన వివరణాత్మక సమాచారం ఆ చీటీలో ఉంది. జాబితా చివరలో ఇవి కూరగాయల వ్యాపారి దగ్గరి నుంచి  తీసుకురావాలని ఆ భార్య గుర్తుచేసింది. 

ఈ పోస్ట్ @trolls_official అనే పేజీ ద్వారా Instagramలో షేర్‌  చేశారు. ఈ జాబితాను చూసిన నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక యూజర్‌ ఇలా రాశాడు ‘ఆ మహిళకు అవార్డు ఇవ్వాల్సిందే’ అనగా, మరో యూజర్‌ ఈ మహిళ ఆమె పనిచేస్తున్న కార్యాలయంలో మంచి ఎక్స్‌ప్లైనర్‌ అయివుంటుందని రాశారు. 
ఇది కూడా చదవండి: ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది?

మరిన్ని వార్తలు