జమ్మూకశ్మీర్‌ లిథియం నిల్వలు అత్యుత్తమ రకం

12 Feb, 2023 03:09 IST|Sakshi

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో బయటపడిన లిథియం నిల్వలు అత్యుత్తమ రకానికి చెందినవని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో సుమారు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు భారత భూగర్భ పరిశోధన సంస్థ (జీఎస్‌ఐ)కనుగొన్న విషయం తెలిసిందే. ‘‘లిథియం కీలకమైన ఖనిజ వనరు.

ఇది గతంలో దేశంలో అందుబాటులో లేదు. నూటికి నూరు శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. సాధారణంగా లిథియం నాణ్యత 220 పీపీఎం(పార్ట్స్‌ పర్‌ మిలియన్‌)గా ఉంటుంది. అయితే, కశ్మీర్‌లో కనుగొన్న లిథియం నాణ్యత 500 పీపీఎం ప్లస్‌గా ఉంది. లిథియం లభ్యతలో మన దేశం చైనాను మించిపోతుంది’’ అని కశ్మీర్‌ గనుల శాఖ కార్యదర్శి అమిత్‌ శర్మ చెప్పారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు