టీచర్‌కు సారీ చెప్పి ముద్దుపెట్టిన బుడతడు.. వీడియో వైరల్‌

13 Sep, 2022 19:11 IST|Sakshi

పాలబుగ్గల పసివాడు తన క్లాస్ టీచర్‌కు క్షమాపణలు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తరగతి గదిలో అల్లరి చేసినందుకు ఆ బుడ్డోడిపై టీచర్‌కు కోపం వచ్చింది. ఇకపై అతనితో మాట్లాడనని చెప్పింది. దీంతో ఆ బాలుడు ఆమె దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. టీచర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నవ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావ్. తప్పు చేయనని చెప్పి మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటావ్. నీతో ఇక మాట్లాడను అని అలకబూనింది.

అందుకు బుడ్డోడు బదులిస్తూ.. మళ్లీ క్లాస్‌లో అల్లరిచేయనని చెప్పాడు. ఇది చివరిసారి అన్నాడు. అంతేకాదు టీచర్‌కు రెండు ముద్దులు కూడా పెట్టాడు. దీంతో ఆమె అలకవీడింది. బుడ్డోడికి కూడా రిటర్న్ కిస్ ఇచ్చింది. చూడచక్కగా ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. చాలా క్యూట్, అడోరబుల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

చదవండి: భర్తకు ట్రాన్స్‌వుమన్‌తో ఎఫైర్.. పెళ్లికి అంగీకరించిన భార్య..

మరిన్ని వార్తలు