వైరల్‌: నెటిజన్లు మెచ్చిన పసి హృదయం

23 Jun, 2021 13:55 IST|Sakshi

దేశంలో దాదాపు 47.2 కోట్ల మంది చిన్నారులున్నారు. అయితే వీరిలో చాలా మంది పొలం పనులకు వెళ్లడం, చెత్త ఏరుకోడం, రోడ్ల కూడళ్లలో బెలూన్లూ, పెన్నుల వంటివి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక సమాజంలో కొన్ని సన్నివేశాలు సినిమాను మించి ఉంటాయి. అవి చూసిన మనిషికి కన్నీళ్లు తెప్పిస్తాయి.  తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఓ వీధి బాలుడు కారు వద్దకి వెళ్లి ఏదైనా ఇవ్వమని అడుగుతాడు. అయితే అంతే వయసు ఉన్న కారులోని పిల్లాడికి ఆ దృష్యాన్ని చూసి  హృదయం ద్రవించుకుపోయింది. అంతే తన దగ్గర ఉన్న డబ్బులను తీసి ఇస్తాడు. అతడు ఆడుకోవడానికి తన జేసీబీ బొమ్మను ఇచ్చాడు. ఇద్దరూ బొమ్మకార్లతో ఆడుకుంటారు.

అంతేకాదండోయ్‌  తినడానికి ఏదైనా తీసుకురమ్మని చెప్పి ఇద్దరు కలిసి పంచుకు తిన్నారు. జేసీబీ బొమ్మను తిరిగి ఇస్తుంటే.. గిప్ట్‌గా ఉంచుకోమన్నట్టు కనిపించే దృష్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో.. తెలియదుకానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘పిల్లలు దేవుళ్లతో సమానం. కారులోని అబ్బాయి, ఆ వీధి బాలుడు ఇద్దరిది విడదీయరాని బంధమై ఉంటుంది. దేవుడి ఆశీసులు వారికి ఎప్పుడూ ఉంటాయి.’’ అంటూ కామెంట్‌ చేశారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘నిజంగా ఇదో అద్భుతమైన దృష్యం. దీన్ని చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. సినిమాల్లో వచ్చే ఇలాంటి సన్నివేశాలు ఎక్కడి నుంచో పుట్టవు.. మనిషి జీవితాల్లోని సంఘటనలే.’’ అంటూ రాసుకొచ్చాడు.

చదవండి: రాస్‌ టేలర్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు