కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!

12 Oct, 2021 14:15 IST|Sakshi

న్యూఢిల్లీ: మనం ఎక్కడికైన వెళ్తున్నప్పుడూ అనుకోకుండా ఎవరైన మనకు ఇష్టమైన స్నేహితులో, బంధువులో ఎదురైతే మన ఆనందానికి అవధులే ఉండవు కదా. అందులోకి మనకు మరింత ఇష్టమైన వాళ్లైతే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఓ తల్లి కూతుళ్లు ఒక విమానంలో ప్రయాణిస్తుంటారు.

(చదవండి: జుట్టుతో లాగేస్తోంది.. ఇది చమురు ధరల ఎఫెక్టేనా?)

ఇంతలో  తాను ప్రయాణిస్తున్న అదే విమానంలో వాళ్ల నాన్న పైలెట్‌గా రావడం చూసి ఒక్కసారిగా ఆ పాప డాడీ అని అరుస్తుంది. ఈ మేరకు ఆ పాప తల్లి నాన్న కూడా మనతో పాటే ఈ విమానంలోనే  వస్తారని చెప్పడంతో ఐలవ్‌ యూ పప్పా అంటూ  ఆనందంతో గెత్తులేస్తుంది. అయితే  ఆ పాప తల్లి ప్రియాంక మనోహత్‌ ఈ సంఘటనను వీడియో తీసి నా చిన్నారి తల్లి షనాయ్‌ మోతిహర్‌కి ఈ వీడియో అంకితం అంటూ ట్యాగ్‌ లైన్‌ జోడించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు చిన్నారి షెనాయ​ నాన్న చూడగానే ఎంతలా సంబరపడింది అని ఒకరు, ఇది ఒక అపరూపమైన ఘటం అని మరోకరు అంటూ రకరకాలుగా కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వస్తున్నాయి. మీరూ ఓ లుక్‌ వేయండి.

(చదవండి:  టైంకి ఎయిర్‌పోర్ట్‌కి చేరాలంటే ట్రాక్టర్‌పై వెళ్లక తప్పదు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు