టిఫిన్‌ ప్లేట్‌లో బల్లి...కస్టమర్‌కి ఎదురైన చేదు అనుభవం

16 Jun, 2022 15:13 IST|Sakshi

ఇటీవల కాలంలో కొన్ని హోటల్లో సదరు కస్టమర్లకు ఎదురైన చేదు అనుభవాలను చూస్తే బయట ఫుడ్‌ తినాలంటేనే భయపడేలా చేశాయి. మొన్నటికి మొన్న ఒక ఆమె కూతురు కోసం దోశ ఆర్డర్‌ చేస్తే...ప్యాకింగ్‌ చేసిన పేపర్‌ పై పాము కుబుసం చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. మరొకసారి సాంబార్‌ బొద్దింకల అవయవాలను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అవన్నీ ఒకత్తెయితే ఇక్కడొక కస్టమర్‌ ఆర్డర్‌ చేసిన టిఫిన్‌ ప్లేట్‌లో బతుకున్న బల్లిని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

వివరాల్లోకెళ్తే...చండీగఢ్‌లో ప్రసిద్ధి చెందిన ఈలాంటే మాల్‌లోని సాగర్‌ రతన్‌ ఫుడ్‌ కోర్ట్‌లో గురిందర్‌ చీమా అనే కస్టమర్‌కి చేదు అనుభవం ఎదురైంది. చోలే భాతురే(పూరీ, శనగల కర్రీ) ఆర్డర్‌ చేశాడు. సదరు కస్టమర్‌ పూరీ తిందాం అనుకునేటప్పటికీ ప్లేట్‌లో బతికున్న బల్లిని చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు.

దీంతో సదరు కస్టమర్‌ ఫిర్యాదు మేరకు ఆరోగ్యశాఖాధికారులు రంగంలోకి దిగి ఆహార పదార్థాల నమునాను సేకరించి పరీక్షలకు పంపిచడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బీజేపీకి పార్టీకి చెందిన రవిరాయ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు ఫుడ్‌ కోర్ట్‌లో ఇది సర్వసాధారణం, బొద్దింకలు, చిన్న చిన్న సరీసృపాలు కూడా ఆహారాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాయంటూ వ్యగ్యంగా కామెంట్లు చేస్తూ...ట్వీట్‌ చేశారు. 

(చదవండి: అట్టహాసంగా లగ్జరీ కారుల్లో డ్యాన్స్‌లు చేస్తూ... పెళ్లి ఊరేగింపు...సీన్‌ కట్‌ చేస్తే...)

మరిన్ని వార్తలు