రైలు ఆపి, ప్రాణం నిలిపి 

7 Sep, 2022 08:40 IST|Sakshi

యశవంతపుర: రైలు పట్టాలపై ఉన్న వ్యక్తిని గమనించిన లోకోపైలట్‌ రైలు వేగాన్ని తగ్గించి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా సుళ్య వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. బెంగళూరు నుండి కుక్కే సుబ్రమణ్యరోడ్డు, పుత్తూరు మార్గంలో కారవారకు వెళ్తుండగా సరిమొగరు, ఎడమంగల స్టేషన్ల మధ్య రైలు వేగంగా వస్తోంది. అదే సమయంలో పట్టాలపై 45 ఏళ్ల వ్యక్తి   ఉండటాన్ని దూరం నుంచి గమనించిన లోకోపైలెట్‌ అతని ప్రాణాలను కాపాడాలని రైలు వేగాన్ని తగ్గిస్తూ వచ్చాడు.

అతని సమీపానికి వచ్చేలోపే రైలు పూర్తిగా వేగం తగ్గింది. అతనికి ఢీకొనగా చిన్నపాటి గాయాలయ్యాయి. ఆ వెంటనే లోకోపైలెట్, టీసీ బాధితుడిని అదే రైలులో తీసుకుని పుత్తూరు రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి రైల్వే సిబ్బంది అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.      

(చదవండి: హెలికాప్టర్‌ సర్వీస్‌ అని రూ. 17 వేలు టోపి)

మరిన్ని వార్తలు