One Nation One Ration Card: ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం?

18 May, 2021 17:16 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీకు 50 వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశం అందిస్తుంది. 50 వేల రూపాయలను గెలుచుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక పోటీని నిర్వహిస్తుంది. దీనిలో గెలచిన వారికి మొదటి బహుమతి కింద రూ.50 వేల అందజేస్తారు. ఇందులో పాల్గొనడానికి మీరు ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఇంటి నుంచే ఇందులో పాల్గొనవచ్చు. ఈ పోటీలో భాగంగా మీరు వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ పథకం లోగోను తయారు చేయాలి. మీరు డిజైనింగ్‌లో నిపుణులైతే, లాక్‌డౌన్‌లో ఇది మీకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది.

దీనికి సంబంధించిన సమాచారం మై గోవ్ ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇవ్వబడింది. ఇందుకోసం, మొదట మీరు భారత ప్రభుత్వ ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన లోగో డిజైన్ పోటీలో భాగం కావాలి. మీరు 31 మే 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలో గెలిచిన మొదటి వ్యక్తికి 50 వేల రూపాయల నగదుతో పాటు ఈ-సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఇక మిగత ముగ్గురికి ఈ-సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

ఈ పోటీలో పాల్గొనడానికి, మీరు మొదట myGov.in పోర్టల్‌కు వెళ్లాలి. ఇక్కడ మీరు పోటీకి వెళ్లి లాగిన్ టు పార్టిసిపేట్ టాబ్ పై క్లిక్ చేయాలి. దీని తరువాత, రిజిస్ట్రేషన్ వివరాలను నింపాలి. రిజిస్ట్రేషన్ తరువాత, మీరు మీ ఎంట్రీని సమర్పించాలి. లోగో డిజైన్ పోటీలో ఏ వయసు వారు అయినా పాల్గొనవచ్చు. పాల్గొనేవారు గరిష్టంగా మూడు ఎంట్రీలను నమోదు చేయవచ్చు. లోగో ఫార్మాట్ JPEG, BMP లేదా TIFFలో అధిక రిజల్యూషన్ (600 dpi) చిత్రంగా ఉండాలి. లోగో గురించి 100 పదాలలో సమాచారం కలిగి ఉండటం చాలా ముఖ్యం.

చదవండి:

మరో కీలక ప్రాజెక్టుకు రిలయన్స్‌ జియో శ్రీకారం

మరిన్ని వార్తలు