‘లోక్‌మత్‌’ ఆధ్వర్యంలో.. కార్గిల్‌ స్మారక భవనం

30 Jul, 2022 07:47 IST|Sakshi

ద్రాస్‌ (లదాఖ్‌): జమ్మూ కశ్మీర్‌లోని ద్రాస్‌ సెక్టర్‌లో లోక్‌మత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన కార్గిల్‌ స్మారక భవనాన్ని జవాన్లకు అంకితం చేశారు. కార్గిల్‌ యుద్ధ విజయానికి గుర్తుగా నిర్మించిన కార్గిల్‌ వార్‌ మెమోరియల్‌ రక్షణ విధుల్లో ఉండే జవాన్ల సౌకర్యార్థం లోక్‌మత్‌ మీడియా గ్రూప్‌ దీన్ని నిర్మించింది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ పద్ధతుల్లో నిర్మించిన ఈ భవనాన్ని లోక్‌మత్‌ మీడియా ఎడిటోరియల్‌ గ్రూప్‌ చైర్మన్, మాజీ ఎంపీ విజయ్‌ దర్దా చేతుల మీదుగా జవాన్లకు అంకితం చేశారు. గడ్డ కట్టించే చలిలో స్మారక పరిరక్షణ విధుల్లో ఉండే జవాన్లకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా దర్గా ఆశాభావం వెలిబుచ్చారు. కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ అనింద్య సేన్‌గుప్తా, మేజర్‌ జనరల్‌ నాగేంద్ర సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక!

మరిన్ని వార్తలు