ఒంటరి ఏనుగుపై 14 సింహాలు దాడి.. అయినా సరే నిరాశే!

28 Aug, 2022 16:56 IST|Sakshi

ఒకటి రెండు సింహాలు ఉంటేనే మిగిలిన జంతువులు హడలిపోతాయి. అలాంటిది ఒంటరిగా ఉన్నప్పుడు పదికిపైగా సింహాలు ఒక్కసారిగా వెంటపడితే అంతే ఇక.. వాటికి ఆహారమైపోయినట్లేనని భావించాల్సిందే. అయితే.. తనను వేటాడేందుకు 14 ఆడ సింహాలు వెంటపడుతున్నా జవలేదు ఓ గజరాజు. ఒంటరిగా ఉన్న బెదరకుండా వాటి బారి నుంచి తప్పించుకుంది. సింహాలను గజరాజు ఏవిధంగా ఎదిరించిందనే విషయాన్ని చెబుతూ ఆ దృశ్యాలను అటవీ శాఖ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఒంటరిగా ఉన్న ఏనుగును 14 ఆడ సింహాలు వేటాడేందుకు ప్రయత్నించినా.. వాటిపై గెలిచింది. ఇక్కడ అడవికి రాజు ఎవరు అని ఊహిస్తున్నారు?’  అని రాసుకొచ్చారు.   

వీడియోలో.. ఓ నదిలోకి నీళ్లు తాగేందుకు వచ్చిన గజరాజుపై దాడి చేశాయి సింహాలు. ఓ సింహం దానిపైకి ఎక్కి అధిమిపట్టే ప్రయత్నం చేయగా.. మిగిలినవి కాళ్లు, ఇతర భాగాలను నోట కరిచేందుకు యత్నించాయి. వాటిబారి నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది ఏనుగు. కాళ్లతో తంతూ తొండంతో కొడుతూ చెదరగొట్టింది. అయినా.. అవి వెనక్కి తగ్గకపోవటంతో నీటిలోకి వెళ్లింది. కొంత దూరం వరకు వెళ్లిన సింహాలు.. ఇక ఏనుగు తమకు చిక్కదని భావించి వెనుదిరిగాయి.

ఇదీ చదవండి: పొలంలో నిద్రిస్తున్న మహిళపైకి నాగుపాము.. ఎలా తప్పించుకుందంటే?

మరిన్ని వార్తలు