తాజ్‌మహల్‌ వద్ద పైథాన్‌ హల్‌చల్‌

7 Apr, 2021 21:12 IST|Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా తాజ్‌మహల్‌ సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. మంగళవారం అనుకోని అతిధిలా ఓ పైథాన్‌ వచ్చేసి హల్‌చల్‌ చేసింది. తన రాకతో అక్కడి స్థానికులను, తాజ్‌మహల్‌  సిబ్బందిని కాసింత భయభ్రాంతులకు గురి చేసింది. వెస్ట్ గేట్ వద్ద ఉన్న పర్యాటక పోలీసు అధికారుల టికెట్ కౌంటర్ వద్ద 5 అడుగుల పొడవైన ఇండియన్ రాక్ పైథాన్‌ను చూసి జనం షాకయ్యారు. వారు వెంటనే స్పందించి  సమీపంలోని  వైల్డ్ లైఫ్ ఎస్‌ఓఎస్‌ టీంకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం ఆ పాముని చాకచక్యంగా పట్టుకున్నారు. పైథాన్‌ను కొన్ని గంటల పాటు పరిశీలనలో ఉంచి, ఆ తరువాత పక్కనే ఉన్న అడవిలోకి విడిచి పెట్టారు.


వైల్డ్‌లైఫ్ ఎస్‌ఓఎస్‌ను సమాచారం అందించిన టూరిజం పోలీస్ కానిస్టేబుల్ విద్యాభూషణ్ సింగ్ మాట్లాడుతూ.. పైథాన్‌ను టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నట్లు మొదట స్థానిక పర్యాటకులు గుర్తించారు. వెంటనే ఆ పరిసర ప్రాంతాలల్లో  ప్రజలను అప్రమత్తం చేసి , అటు పక్క ఎవరు రాకుండా చూశాము. ఈ లోగా ఎస్‌ఓఎస్‌ రెస్క్యూ టీం రావడంతో పాముని పట్టుకోగలిగామని అన్నారు. వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ సహ వ్యవస్థాపకుడు ,సిఇఒ కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ..పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి సరైన సమయంలో వైల్డ్ లైఫ్ రక్షణ టీం కు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే పాములు చాలా సున్నితమైన  ప్రాణులు, జాగ్రత్తగా వ్యవహరించకుండా ఉంటే ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు.

( చదవండి: రిపోర్టర్‌ మైక్‌ లాక్కొని కుక్క పరుగో పరుగు..చివరికి )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు