పెళ్లింట విషాదం.. ఆమె ఇలా చేస్తుందని పేరెంట్స్‌ ఊహించలేదు!

20 Jul, 2022 07:34 IST|Sakshi

యశవంతపుర: తమ ప్రేమను పెద్దలు భగ్నం చేశారని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట ఆస్పత్రిలో కన్నుమూసింది. ఉత్తర కన్నడ జిల్లా హళియాళలో ఈ విషాద ఘటన జరిగింది. 

వివరాల ప్రకారం.. హళియాళకు చెందిన జ్యోతి అంత్రోళకర (19), రికేశ్‌ సురేష్‌ మిరాశి (20)లు హళియాళ డిగ్రీ కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నారు. కాలేజీలో పెరిగిన పరిచయంతో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కాగా, నెల రోజుల కిందట తల్లిదండ్రులు జ్యోతికి మరో యువకునితో వివాహం చేశారు. అయితే, పెళ్లి అయిన్పటికీ ప్రియుడిని జ్యోతి మరిచిపోలేదు. 

ఈ క్రమంలో మనస్థాపానికి గురైన ప్రేమికులు.. తాము ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 15వ తేదీన ముండగోడు రోడ్డులో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాడి మంగళవారం మరణించారు. ఈ మేరకు హళియాళ పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు