భర్తకు దూరంగా ఒంటరి జీవితం.. అతడితో ఎంజాయ్‌ చేస్తూ.. చివరకు..

23 Jun, 2022 08:34 IST|Sakshi

మైసూర్‌: వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారునపడేస్తున్నాయి. క్షణికావేశాల కారణంగా వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తాజాగా ఇద్దరు పిల్లలున్న వ్యక్తి.. వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది కాస్తా ప్రాణాలను తీసింది. ఈ ఘటన కర్నాటకలో చేసుకుంది. 

వివరాల ప‍్రకారం.. మైసూర్‌కు చెందిన టి. నరసీపుర తాలూకాలోని తలకాడుకు చెందిన సుమిత్ర(26)కు రవిశంకర్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కాగా, కుటుంబ కలహాల వల్ల సుమ్రిత.. తన భర్తకు దూరంగా ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో మైసూర్‌కు చెందిన సిద్దిరాజుతో సుమిత్రకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి సంబంధం విషయం సిద్దిరాజు భార్యకు తెలియడంతో ఆమె.. భర్తను నిలదీసింది. పెద్దల సమక్షంతో పంచాయితీ పెట్టించింది. అనంతరం.. విడాకులు ఇస్తానని బెదిరించింది. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా సిద్దరాజు.. సుమిత్రతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. సీక్రెట్‌గా సుమిత్రను కలుస్తూ.. వారిద్దరూ ఎంజాయ్‌ చేయడం ప్రారంభించారు. 

ఈ క్రమంలో విహారయాత్రలకు వెళ్లి జల్సా చేశారు. ఇంతలో తలకాడు కావేరి నది సమీపంలోని నిసర్గధామా ప్రాంతంలో సుమిత్రా శవమై కనిపించింది. సుమిత్రా శవం పక్కనే ప్రియుడు సిద్దరాజు కూడా ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. అయితే, సిద్దరాజు చనిపోయే ముందు.. అతని స్నేహితుడికి వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పంపించాడు. మెసేజ్‌లో సుమిత్రా చనిపోయింది.. ఆమె లేని జీవితం నాకు వద్దు, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఈ నేపథ‍్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో! తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలతో కలిసి..

మరిన్ని వార్తలు