పెరిగిన వంట గ్యాస్‌ ధర

2 Dec, 2020 11:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో వరుసగా చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను పెంచాయి. ఇప్పటికే ధరలమోత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మద్య  దేశంలో వంట గ్యాస్  భారం కూడా పెరగనుంది. తాజాపెంపుతో  ఒక్కో సిలిండర్‌పై రూ.50 భారం పడనుంది. కొత్త ధరలు ఈ రోజు (డిసెంబర్,2)నుండి  అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న  సామాన్యులపై మరో పిడుగు పడింది.

ఈ పెంపుతో హైదరాబాద్‌లో  సిలిండర్‌ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5చేరినట్టు తెలుస్తోంది. అలాగే  తాజా నివేదికల  ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో రాయితీ సిలిండర్‌ రూ.644కు పెరిగింది. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉండటంతో సిలిండర్‌ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి.  అయితే  దేశంలోని అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ ఐఓసీ వెబ్‌సైట్‌లో ఇచ్చిన ధర ప్రకారం ఢిల్లీలో ధరలు వంట గ్యాస్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 594 రూపాయలుగా ఉండగా ముంబైలో సిలిండర్ ధర రూ .594. చెన్నైలో  610 రూపాయలు, కోల్‌కతాలో  రూ. 620 గా ఉంది.

 కమర్షియల్‌ సిలిండర్‌  ధర పెంపు
19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధర  పెరిగింది.  చెన్నైలో అత్యధికంగా సిలిండర్‌కు 56  రూపాయల చొప్పున భారం పడగా ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాలలో 55 రూపాయలు పెరిగింది.  

మరిన్ని వార్తలు