కరోనా విషాదం: ప్రముఖ కార్డియాలజిస్ట్‌ మృతి

1 May, 2021 10:33 IST|Sakshi

లక్నో: వైద్యో నారాయణో హరి అంటారు. అంటే రోగుల ప్రణాలను కాపాడే డాక్టర్లు దేవుడితో సమానం అని అర్థం. అయితే, కోవిడ్‌ బాధితులకు అహోరాత్రుళ్లు సేవలందిస్తున్న ఆ దేవుళ్లను కరోనా కబలిస్తోంది. పీపీఈ కిట్ల వంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరు డాక్టర్లు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అలాంటి విషాద ఘటన ఒకటి వెలుగుచూసింది.

దేశవ్యాప్తలంగా కరోనాబారినపడి 780 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. గతనెల ఏప్రిల్‌ లోనే సుమారు 34మంది డాక్టర్లు కరోనా కారణంగా మరణించడంతో .. కరోనా బాధితులకు ట్రీటెంట్‌ ఇస్తున్న డాక్టర్ల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. తాజాగా లక్నో మెడికల్ కాలేజీ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఫజల్ కరీం కరోనాతో మరణించారు. 'కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో డాక్టర్ కరీమ్‌ కరోనా బారినపడ్డారు. ఏప్రిల్‌ 16న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హోం ఐసోలేషన్‌ లో ఉండి ట్రీట్మెంట్‌ తీసుకున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ప్రాణాలు విడిచారు’ అని  లక్నో మెడికల్ కాలేజ్  ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఫరీడి తెలిపారు.

ఇక దేశంలో కరోనా విలయతాండవం చేయడంతో రోజురోజుకి కోవిడ్‌ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 4 లక్షల  కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజు మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి.

మరిన్ని వార్తలు