దైవ దర్శనానికి వెళ్తూ.. కిక్కిరిసిన జనంతో పల్టీలు కొడుతూ నీట పడ్డ ట్రాక్టర్‌

26 Sep, 2022 15:15 IST|Sakshi

లక్నో: కిక్కిరిసిన జనంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ బోల్తా కొట్టి నీటి కొలనులో పడిపోగా.. పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తర ప్రదేశ్‌ లక్నో శివారులోని ఇటావుంజా దగ్గర సోమవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 

ఎక్కువ మందిని తీసుకెళ్తున్న సమయంలో.. ఓవర్‌లోడ్‌ కారణం ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా కొడుతూ మెయిన్‌ రోడ్డు పక్కనే ఉన్న నీటి కొలనులో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగింది. స్థానికుల సాయంతో అధికారులు 37 మందిని రక్షించింది. మరో పది మంది మృతి చెందినట్లు ఐజీ లక్ష్మిసింగ్‌ వెల్లడించారు. 

మృతులంతా సీతాపూర్‌ అట్టారియాకు చెందిన వాళ్లుగా నిర్ధారణ అయ్యింది. నవరాత్రి సందర్భంగా ఇటావుంజాలోని ఉన్నాయ్‌ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలకు వెళ్తూ వీళ్లంతా ప్రమాదంలో మరణించారు. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించనున్నట్లు ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు