రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఘటన జరిగిన రెండేళ్లకు పరిహారంగా రూ.65.62లక్షలు 

14 Dec, 2022 11:18 IST|Sakshi

సాక్షి, ముంబై: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా రూ.65.62 లక్షలు చెల్లించాలని థానె జిల్లా మోటారు ప్రమాదాల క్లెయిమ్‌ ట్రిబ్యునల్‌ (ఎంఏసీటీ) బీమా సంస్థ నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ను, ప్రమాదానికి కారణమైన మరో వాహనదారుడిని ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఏడాదికి 8శాతం వడ్డీతో సహా సదరు బాధిత కుటుంబానికి అందజేయాలని ఎంఏసీటీ స్పష్టం చేసింది. ఈమేరకు ఎంఏసీటీ సభ్యుడు హెచ్‌.ఎం భోశాలే ఆదేశాలిచ్చారు. అయితే ఈ ఆదేశాలను గతనెల 16న ఇవ్వగా సోమవారం లిఖితపూర్వకంగా బీమా సంస్థకు, సదరు వాహన యజమానికి అందజేశారు.  

పిటిషనర్‌తరఫున ఎస్టీ కదమ్‌ ట్రిబ్యునల్‌ వాదనలు వినిపించారు. సందేశ్‌ షిండే (35) అనేవ్యక్తి తన స్నేహితుడితో కలసి మోటార్‌ సైకిల్‌పై కోపార్టైన్‌కు 2020 మార్చి 18 రాత్రి బయల్దేరి వెళ్తుండగా.. ఒక ట్రాలర్‌ వచ్చి వారిని వేగంగా ఢీకొట్టండంతో వాళ్లిద్దరూ పడిపోయారు. అయితే సందేశ్‌ షిండే అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. షిండే చనిపోయేనాటికి ఓ ప్రైవేటు కంపెనీలో నెలకు రూ.32.655 జీతాన్ని సంపాదిస్తున్నాడు. ఆ కుటుంబానికి షిండేనే ఆధారం కావడంతో అతని మృతితో కుటుంబం రోడ్డున పడిపోయింది.

అతడికి భార్య, ఇద్దరు కొడుకులు, తల్లి ఉన్నారు. షిండే మృతి అనంతరం ప్రమాదానికి కారణమైన ట్రాలర్‌ యజమానితోపాటు బీమా సంస్థ నేష నల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ కూడా వీరికి నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పుకోకుండా వివి« ద రకాల కారణాలను చూపి అడ్డుకున్నారు. అయితే ఎంఏసీటీలో వాదనల అనంతరం బాధిత కుటుంబానికి రూ.63.96లక్షలు నష్టపరిహారంగా, రూ.16,500 మట్టి ఖర్చులకుగా ను, భార్యకు రూ.44000, తల్లికి రూ.88,000 చెల్లించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.    
చదవండి: కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి.. పలువురికి అస్వస్థత

మరిన్ని వార్తలు