Madhya Pradesh: అరగంట దాటినా రాని అంబులెన్సు.. బుల్‌డోజర్‌లోనే ఆస్పత్రికి తరలింపు

13 Sep, 2022 17:13 IST|Sakshi

భోపాల్: బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడ్ని మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కిందపడిన అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్‌ చేశారు. అయితే 30 నిమిషాలు గడిచినా అక్కడికి అంబులెన్స్ రాలేదు. యువకుడికి మాత్రం తీవ్ర రక్తస్రావమవుతోంది. దీంతో చలించిపోయిన ఓ వ్యక్తి.. అతడ్ని బుల్‌జోడర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్‍లోని కట్నీలో ఈ ఘటన జరిగింది.

రోడ్డుప్రమాదం తన షాపు ముందే జరిగిందని, యువకుడికి రక్తస్రావం కావడం చూసి బాధతో జేసీబీలో అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నట్లు దాని యజమాని పుష్పేంద్ర తెలిపాడు. కాగా.. గాయపడిన యువకుడ్ని మహేశ్ బుర్మాగా గుర్తించారు. ఆస్పత్రికి తీసుకెళ్లాక వైద్యులు అతనికి వెంటనే చికిత్స అందించారు. అతని కాలికి ఫ్రాక్చర్ అయిందని గుర్తించి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి సిఫారసు చేశారు. అయితే యువకుడ్ని జేసీబీలో ఆస్పత్రికి తరలించిన దృశ‍్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చదవండి: నా శాఖలో అందరూ దొంగలే.. బిహార్ మంత్రి వ్యాఖ్యలు వైరల్..

మరిన్ని వార్తలు