‘ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్ని స్థానికులకే’

18 Aug, 2020 18:00 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ప్రజలకు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ శుభవార్త తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వంద శాతం రాష్ట్ర యువతకే అర్హత కల్పిస్తామని మంగళవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.  అయితే 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర యువతకే ప్రభుత్వ ఉద్యోగాలు అనే ప్రకటనను సీఎం చౌహాన్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా 10, 12వ తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు.

రాష్ట్రంలో ప్రతిభ గల విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ పథకాల అమలులో సింగిల్‌ డేటా బేస్‌లో(వివిధ పథకాలకు అర్హుల జాబితా) పొందు పరుస్తామని తెలిపారు. ఈ ప్రక్రియతో పథకాల లబ్డిదారులు ఒక సారి డేటా బేస్‌లో తమ పేరును నమోదు చేసుకుంటే అర్హత కలిగిన వివిధ పథకాలను పొందవచ్చని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ పేర్కొన్నారు.
చదవండి: సీఎం ఎడిటెడ్‌ వీడియో పోస్ట్‌ .. దిగ్విజయ్‌పై కేసు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా