కొవిడ్ మృతుల కుటంబాలకు రూ.ల‌క్ష ఆర్థిక సాయం

21 May, 2021 12:40 IST|Sakshi

భోఫాల్: మధ్యప్రదేశ్‌లో కరోనా విజృంభన కొనసాగుతుంది.కరోనా మృతుల విషయంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్‌లో కరోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌ను ఆదుకోవాలని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ మృతుల కుటుంబాల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేర‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్ర‌క‌టించారు. గురువారం ఎమ్మెల్యేల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించించిన  అనంత‌రం  సీఎం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

క‌రోనా వ‌ల్ల త‌మ వారిని కోల్పోయిన లోటు తీర​లేనదని, ఆ బాధ‌ల‌లో ఉన్న‌వారికి కొంత ఉప‌సమ‌నం క‌లిగించాల‌ని నిర్ణ‌యించామ‌ని సీఎం అన్నారు. ఇందులో భాగంగా వారికి కొంత‌మేర‌కు కొంత ఆర్థిక సాయం అందిస్తామ‌ని చెప్పారు.క‌రోనా బారిన‌ప‌డినవారిని కాపాడాల‌ని తాము తీవ్రంగా  ప్ర‌య‌త్నించం ,కానీ ర‌క్షించ‌లేక‌పోయాం. అందువ‌ల్ల వారిని వారి కుటుంబాల‌కు రూ.ల‌క్ష న‌ష్ట‌ప‌రిహారం ఇస్తుమ‌ని వెల్ల‌డించారు. కాగా, ఇప్ప‌టికే  ప్ర‌భుత్వ ఉద్యోగులు  క‌రోనాతో చ‌నిపోతే వారి కుటుంబ స‌భ్యుల‌కు రూ.5 ల‌క్ష‌లు అక్కడి ప్ర‌భుత్వం అందిస్తున్న‌ది.

(చదవండి:పెళ్లికి వెళ్లిన అతిథులు.. ఊహించని పని చేసి వచ్చారు)

మరిన్ని వార్తలు