ఈ మామిడి పండు ఖరీదు రూ.1000  గురూ.. ఎందుకంటే!

7 Jun, 2021 08:48 IST|Sakshi

ఇండోర్: వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి. పండ్లలో రారాజుగా పిలుచుకునే ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అని ప్రతీతి. బంగిన్‌పల్లి, రసాల్‌ వంటి రకారకాల పండ్ల ధరలు మనకు అందుబాటులో ఉంటాయి. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ‘నూర్జాహాన్‌’ రకం మామిడి పండు మాత్రం చాలా ప్రత్యేకం. ఈ మామిడి పండు బరువు కిలోల్లో ఉంటుంది. ఇప్పుడు దీని ధర వెయ్యి రూపాయలు పలుకుతోంది.

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆప్ఘాన్ మూలానికి చెందిన నూర్జహాన్ మామిడిని అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతాలో మాత్రమే పండిస్తారు.  అయితే గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం ఈసారి పెద్దగా ఉండడంతో.. నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్‌లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతులు పేర్కొంటున్నారు.

"నా పండ్ల తోటలో మూడు నూర్జహాన్ మామిడి చెట్లకు 250 మామిడి పండ్లు పండాయి. ఒక్కో పండుకు రూ. 500 నుంచి రూ. 1,000 ధర పలుకుతోంది. ఈ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటారు. అయితే ఈసారి నూర్జహాన్ మామిడి బరువు 2 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య ఉంటుంది. 2019లో ఒక్కో పండు 2.75 కేజీల బరువుతో పండింది. అప్పట్లో అత్యధికంగా ఒక్కో పండు ధర రూ. 1,200 పలికింది." అని కత్తివాడకు చెందిన మామిడి సాగు రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు .

(చదవండి: చేతులు చాచారు.. అడ్డంగా బుక్కయ్యారు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు