మధ్యప్రదేశ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం..‌!

1 Aug, 2020 08:13 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రధారణ విషయంలో పలు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో టీ షర్టు ధరించడం పద్దతి కాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్వాలియర్‌ డివిజన్‌లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు జీన్స్‌, టీ షర్టులు ధరించకుండా నిషేధం విధించింది. దీనికి సంబంధించిన డివిజనల్‌ కమిషనర్‌ ఎంబీ ఓజా సర్క్యూలర్‌ జారీ చేశారు. ఉద్యోగులందరూ హుందాగా, సంప్రదాయంగా ఉండే దుస్తులను ధరించి  విధి నిర్వాహణకు రావాలని ఆదేశించారు. (మెహబూబా నిర్బంధం మరో 3 నెలలు)

కాగా జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్‌సౌర్‌ ఇల్లాలోని ఓ అధికారి పద్దతిగా లేని దుస్తులు (టీ షర్టు) ధరించి హాజరయ్యాడు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. తమ ఉత్తర్వులను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌ కంటే ముందు అనేక రాష్ట్రాలు టీ షర్టు, జీన్స్‌ పై నిషేధం విధించాయి. గత ఏడాది బిహార్‌, తమిళనాడు ప్రభుత్వాలు సైతం సచివాలయంలోని ఉద్యోగులు ఈ దుస్తులు ధరించరాదని ఉత్తర్వులు జారీ చేశాయి. (సెల్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేస్తే 10 వేలు ఫైన్‌)

>
మరిన్ని వార్తలు