కర్ణన్‌కు బెయిల్‌

25 Mar, 2021 08:55 IST|Sakshi
రిటైర్డ్‌ జడ్జి కర్ణన్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, చెన్నై: రిటైర్డ్‌ న్యాయమూర్తి కర్ణన్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. న్యాయమూర్తులు, న్యాయ లోకానికి వ్యతిరేకంగా రిటైర్డ్‌ న్యాయమూర్తి కర్ణన్‌ వీడియో విడుదల చేయడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ కేసు విచారణ సమయంలో హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. కర్ణన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. డీజీపీ, చెన్నై పోలీసు కమిషనర్లకు నోటీసులు సైతం జారీ అయ్యాయి. దీంతో  కర్ణన్‌ను ఇటీవల అరెస్టు చేశారు. జైలులో ఉన్న కర్ణన్‌ బెయిల్‌ మంజూరు చేయాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తొలుత ఆయన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి భారతీ దాసన్‌ బెంచ్‌ తిరస్కరించింది. దీంతో మరోసారి బెయిల్‌ కోసం విజ్ఞప్తి చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం సాగిన విచారణలో వాదనల అనంతరం కర్ణన్‌కు షరతులతో కూడిన  బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.  
 

మరిన్ని వార్తలు