మావోయిస్టు కీలక నేత హిడ్మాకు తీవ్ర అస్వస్థత!

25 Jun, 2021 14:18 IST|Sakshi
మావోయిస్టు కీలక నేత మడవి హిడ్మా ( ఫైల్‌ ఫోటో )

ఛత్తీస్‌గఢ్ : మావోయిస్టు కీలక నేత మడవి హిడ్మా తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం. హిడ్మా  కోవిడ్‌తో బాధపడుతున్నాడని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. అతడు లొంగిపోతే చికిత్స అందిస్తామని అంటున్నారు. కాగా, మడవి హిడ్మా (మడవి ఇడమా) అలియాస్‌ సం తోష్‌ అలియాస్‌ ఇడ్మాల్‌ అలియాస్‌ పొడియం బీమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల శివారు నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరం లోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల పువ్వర్తి గ్రామంలో పుట్టి పెరిగాడు. ఇతను పదిహేనేళ్ల క్రితం స్థానిక పరిస్థితుల ప్రభావంతో మావోయిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు.

బస్తరియా మురియా తెగకు చెందిన హిడ్మా.. చదివింది ఐదో తరగతే అయినా, హిందీ–ఇంగ్లి్లష్‌ భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. దళంలో అతను చాలామందికి గెరిల్లా యుద్ధవిద్యల్లో శిక్షణ ఇస్తాడు. దండకారణ్యంలో అతన్ని మామూలు స్థాయి దళసభ్యుడు కలవడం దాదాపు అసాధ్యం. భార్యతో కలసి ఉండే అతని చుట్టూ అత్యాధునిక ఆయుధాలతో కూడిన దాదాపు 20 మందికిపైగా దళ సభ్యులు రక్షణ వలయంగా ఉంటారు. అందులో మెజారిటీ సభ్యులు అతని బంధువులు, బాల్యమిత్రులే కావడం గమనార్హం.   ఇతడిపై రూ. 25 లక్షల రివార్డు ఉంది.

చదవండి : కీచకుడు: వాట్సాప్‌ కాల్స్‌తో 370 మంది మహిళలకు టార్చర్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు