మాజీ సీఎంకు కరోనా పాజిటివ్

24 Oct, 2020 14:58 IST|Sakshi
దేవేంద్ర పడ్నవిస్ (ఫైల్ ఫోటో)

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో  కరోనా మహమ్మారి  బారిన పడుతున్న రాజకీయ నాయకులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారు పరీక్షలు చేసుకోవాల్సిందిగా సూచించారు. ‘లాక్‌డౌన్‌ నుంచి నిరంతరం పనిలో ఉన్నాను. ఇపుడిక కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ఆ దేవుడు కోరుకున్నట్టున్నాడు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. వైద్యుల సలహామేరకు చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు.

వరుసగా అగ్రనేతలకు కరోనా రావడంపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన అశోక్‌ గస్తీ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ కోవిడ్‌ నుంచి కోలుకోవాలని బీజేపీ అగ్ర నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. (అజిత్ పవార్‌కు కరోనా పాజిటివ్)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు