భారీ ట్రాఫిక్‌, 20 టన్నుల టమోటా నాశనం

16 Jul, 2021 09:26 IST|Sakshi

భారీ టమోటా లోడ్‌తో  ట్రక్‌  బోల్తా 

భారీగా ట్రాఫిక్‌ జామ్‌ 

20 టన్నుల  టమోటాను తొలగించిన అధికారులు

సాక్షి, ముంబై:మహారాష్ట్రలో అనుకోని రోడ్డు ప్రమాదం, భారీ ట్రాఫిక్‌ రైతుల పాలిట శాపంగా  పరిణమించింది. భారీ టమోటా లోడ్‌తో వస్తున్నట్రక్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 టన్నుల టమోటా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. ఫలితంగా ట్రాఫిక్ జామ్  ఏర్పడింది. దీంతో అధికారులు బుల్డోజర్ల సాయంతో టమోటాలను తొలగించి మరీ ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఈ ఘటన రైతులను నష్టాల్లోకి నెట్టేసింది. ట్రక్ బోల్తా పడిన ఈ ఘటనలో ఒకరు గాయపడగా, ఆసు పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈస్టర్న్ఎక్స్‌ప్రెస్ హైవేపై థానేలోని కోపారి సమీపంలో  ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఈ ఘటనతో టమోటా రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే నాశనం కావడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఒకవైపు గిట్టుబాటు ధర లేక రైతు అల్లాడిపోతున్నాడు. మరోవైపు పంటను మార్కెట్‌ చేసుకునే అవకాశాలూ అంతంత మాత్రమే. దీంతో అమ్ముకునే దారిలేక నడిరోడ్డుపై టమాటా, క్యాలిఫవర్‌ లాంటి పంటలను స్వయంగా రైతులే  ధ్వంసం చేసిన ఘటనలు గతంలో అనేక చూశాం.

మరిన్ని వార్తలు