Rajya Sabha polls: ఓటు కోసం స్ట్రెచర్‌పై వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌

10 Jun, 2022 15:01 IST|Sakshi

దేశవ్యాప్తంగా రాజ్యసభలో ఖాళీగా ఉన్న 16 స్థానాలకు శుక‍్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, రాజ్యసభ ఎన్నికల వేళ మహారాష్ట‍్రలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడి కూటమి, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ముక్తా తిలక్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుప్రతిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా ఆమె.. ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో ఓటు వేసేందుకు వచ్చారు. ఆమె స్ట్రెచర్‌పై నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

అయితే, ఆమె ఓటు వేసే సమయంలో ఆమె భర్త శైలేష్ శ్రీకాంత్ తిలక్ హాజరు కావడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. కాగా, ముక్తా తిలక్ పూణెలోని కస్బా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. మరోవైపు.. మహారాష్ట‍్రలో రాజసభ్య ఎన్నికల వేల ఎంఐఎం పార్టీ సంచలన నిర‍్ణయం తీసుకుంది. ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి అభ్యర్థి ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హికి తమ మద్దతు ఇస్తున్నట్టు మజ్లిస్‌ పార్టీ తెలిపింది. ఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయనున్నట్టు ఆ పార్టీ ఔరంగాబాద్‌ ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ తెలిపారు.  ఇక, రాజ్యసభ ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు ఓటేసిన జేడీఎస్‌ ఎమ్మెల్యే.. కారణం ఏంటంటే!

మరిన్ని వార్తలు