కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్‌.. 18 మంది మంత్రులు వీరే

9 Aug, 2022 11:33 IST|Sakshi

సాక్షి, ముంబై: ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. 18 మందితో మహారాష్ట్ర కేబినెట్‌ కొలువుదీరింది. మంత్రి వర్గంలో బీజేపీ నుంచి తొమ్మిది,షిండే వర్గం నుంచి 9 మందికి చోటు లభించింది. ఉదయం 11 గంటలకు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ 18 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు.

ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వర్గం: చంద్రకాంత్‌ పాటిల్,సుధీర్‌ మునగంటివార్, గిరీష్‌ మహాజన్, సురేశ్‌ ఖడే,  రాధాకృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్‌ ప్రభాత్‌ లోధా, విజయ్‌ కుమార్‌ గవిత్‌, అతుల్‌ సేవ్‌ ఉన్నారు. 

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే వర్గం: దాదా భుసే, శంభురాజ్‌ దేశాయ్, సందీపాన్‌ భుమరే, ఉదయ్‌ సామంత్‌, తానాజీ సావంత్‌, అబ్దుల్‌ సత్తార్, దీపక్‌ కేసర్కర్, గులాబ్‌రావ్‌ పాటిల్, సంజయ్‌ రాథోడ్‌ ఉన్నారు.

మంత్రుల జాబితా ఇదే

కాగా బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. శిండే, ఫడ్నవీస్‌ ముందుగా కుదుర్చుకున్న 35–65 ఫార్మూలా ప్రకారం ప్రస్తుతం మినీ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇక శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌లు సీఎం, డిప్యూటీ సీఎంలుగా జూన్‌ 30న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు