Maharashtra Viral Video: పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌

7 Jun, 2022 11:15 IST|Sakshi

ముంబై: అర్దరాత్రి ఇంటి ముందు ఉన్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ నెల 5వ తేదీన నాసిక్‌లోని ముంగ్సారే గ్రామంలో నివాస ప్రాంతంలోకి చిరుతపులి ప్రవేశించి హల్‌చల్‌చేసింది.  అర్దరాత్రి ఉంటి ముందు చిన్న గోడపై పెంపుడు కుక్క కూర్చొని ఉండగా.. దూరం నుంచి చిరుతపులి అటు వైపుగా వచ్చింది. చిరుతను గమనించిన శునకం అలెర్ట్‌ అయి పారిపోయేందుకు ప్రయత్నించింది. చిరుత దగ్గరకు రావడంతో గోడ వైపు నుంచి అటు ఇటు దూకుతూ చిరుత దాడి నుంచి తప్పించుకునేందుకు ట్రై చేసింది.

అయితే చిరుతపులి పట్టు వదలకుండా కుక్క వెనకాలే పరుగెత్తింది. అలా కొద్దిసేపటి తరువాత చివరకు ఆ శునకం చిరుతకు ఆహారంగా దొరికిపోయింది.  చిరుతపులి తన దవడలతో కుక్కను కరచుకొని వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.  కాగా జనావాసాల్లో చిరుతపులి సంచారంపై నాసిక్‌ ఫారెస్ట్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతపులి వస్తుండటంతో ముంగ్సారే గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రాత్రిపూట ఇళ్లలోనే నిద్రించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చిరుత సంచరిస్తుందని తెలిసి పెంపుడు కుక్కలను బయట ఎందుకు ఉంచుతున్నారని మండిపడుతున్నారు.
చదవండి: అంత బలుపేంటి భయ్యా.. కారు ఉంటే ఇంట్లో పెట్టుకో చౌదరి సాబ్‌.. 

మరిన్ని వార్తలు